గులాబీ పార్టీలో చేరిన టీడీపీ నేత గండ్ర‌త్ ర‌మేష్

Sun,October 28, 2018 07:17 PM

నిర్మ‌ల్: నియోజ‌క‌వ‌ర్గంలో టీఆర్ఎస్ లోకి భారీగా వ‌ల‌స‌లు పెరిగిపోతున్నాయి. పార్టీ మినీ మ్యానిఫేస్టో ప్ర‌క‌ట‌న త‌ర్వాత ఇత‌ర పార్టీల నేత‌లు టీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఆదివారం మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి స‌మ‌క్షంలో టీడీపీ నేత గండ్ర‌త్ ర‌మేష్ గులాబీ పార్టీలో చేరారు. గండ్ర‌త్ ర‌మేష్ తో పాటు నిర్మ‌ల్ ప‌ట్ట‌ణానికి చెందిన మైనార్టీలు, మ‌హిళ‌లు, వివిధ వ‌ర్గాల‌కు చెందిన ప్ర‌జ‌లు పెద్ద ఎత్త‌ను గులాబీ పార్టీ తీర్థం పుచ్చ‌కున్నారు. అదేవిధంగా సారంగాపూర్ మండ‌ల కేంద్రంతో పాటు మండ‌లంలోని మ‌ల‌క్ చించోలి, యాక‌ర్పెల్లి, ఆలూరు గ్రామాల‌కు చెందిన సుమారు 700 మంది గులబీ పార్టీ తీర్థం పుచ్చ‌కున్నారు.

మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి వారికి గులాబీ కండువాలు క‌ప్పి సాధ‌రంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సంద‌ర్బంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీలో చేరిన కార్య‌క‌ర్త‌ల‌కు పార్టీ అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని.. కార్య‌క‌ర్త‌లు కూడా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేస్తూ టీఆర్ఎస్ గెలుపున‌కు స‌మిష్టిగా కృషి చేయాల‌న్నారు. కాంగ్రెస్ నేత‌లు నియోజ‌క‌వ‌ర్గంలో దిగ‌జారుడు రాజ‌కీయాలు చేస్తున్నార‌ని ఆరోపించారు. కాంగ్రెస్ నేత‌లు రెచ్చ‌గొట్టేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని.. ఈ విష‌యంలో టీఆర్ఎస్ కార్య‌క‌ర్తలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్ఎస్ నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ ఇంచార్జ్ దాద‌న్న‌గారి విఠ‌ల్ రావు, నిర్మ‌ల్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ ద‌ర్మాజీ రాజేంద‌ర్, సారంగాపూర్ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ రాజ్ మహ్మాద్, టీఆర్ఎస్ సీనియ‌ర్ నాయ‌కులు ఆలూరి జీవ‌న్ రావు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

3054
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles