బాసర అమ్మవారిని దర్శించుకున్న నిర్మల్ ఎస్పీ

Fri,February 22, 2019 05:57 PM

nirmal district sp shashidhar raju visit basara saraswathi temple

నిర్మల్ జిల్లా: బాసర,శ్రీ జ్ఞాన సరస్వతీ దేవీ అమ్మవారి దేవస్థానంలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. అమ్మవారి ఆలయంలో ఈ రోజు నిర్మల్ జిల్లా ఎస్పీ శశిధర్ రాజు కుటుంభ సమేతముగా విచ్చేసి తన మనుమరాలు అమృత రాశికి ఆలయ పూజారులచే అన్నప్రాసన చేయించారు. ఎస్పీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ సిబ్బంది, పూజారులు శాలువతో సన్మానించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, ఆలయ ప్రత్యేక అధికారి అన్నాడి సుధాకర్ రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీనివాస్, బాసర మండల ఎస్సై తోట మహేష్ తదితరులు పాల్గొన్నారు.

744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles