మహనీయులను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి..

Sun,October 13, 2019 07:13 PM


వనపర్తి: మహనీయులందరిని ఉన్నతంగా కీర్తించాల్సిన బాధ్యత ప్రస్తుత సమాజంపై ఉందని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్ లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహర్షి శ్రీ వాల్మీకి జయంతి వేడుకలకు మంత్రి నిరంజన్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మహర్షి వాల్మీకి లాంటి మహోన్నత వ్యక్తులను ఉన్నతంగా కీర్తించ వలసిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. మహనీయుల విషయాలను, వారు చూపిన మార్గాలను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని అన్నారు.

మహర్షి వాల్మీకి జయంతిని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించడం సంతోషమన్నారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో వాల్మీకుల సంఖ్య ఎక్కువగా ఉందని, వాల్మీకులను కొన్ని ప్రాంతాలలో ఎస్టీలుగా, మరికొన్ని ప్రాంతాలలో బీసీలుగా చూపిస్తున్నారని, ఈ వివక్షతను 2007 అక్టోబర్ లోనే తాము గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని పేర్కొన్నారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చే విషయమై రాష్ట్రప్రభుత్వం ప్రజాభిప్రాయాన్ని సేకరించి తదుపరి చర్య నిమిత్తం కేంద్రానికి నివేదిక సమర్పించినట్లు తెలిపారు. వాల్మీకులకు రాజకీయపరంగా అవకాశాలు కల్పించటం జరిగిందని, వారి పిల్లలు ఉన్నత విద్యను అభ్యసించేందుకు విద్యాపరంగా అనేక పాఠశాలలు, కళాశాలలు ఉన్నాయన్నారు. వాల్మీల అభివృద్ధికి తన వంతు కృషి ఎల్లప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి...
ఇంచార్జి డిఆర్ఓ వెంకటయ్య, ఆర్ డి ఓ చంద్రారెడ్డి, గోపాల్పేట జెడ్పిటిసి భార్గవిలు పాల్గొన్నారు.

513
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles