పోషకాహారంపై ఎన్‌ఐఎన్ ఈ లెర్నింగ్

Wed,February 20, 2019 07:03 AM

NIN e-Learning on Nutrition diet

హైదరాబాద్: ప్రజలు ఆరోగ్యంగా ఉండేందుకు హైదరాబాద్ జాతీయ పోషకాహార సంస్థ(ఎన్‌ఐఎన్) ఈ-లర్నింగ్ పేరిట సరికొత్త కార్యక్రమాన్ని అందుబాటులోకి తెస్తున్నది. ప్రజల్లో ఆరోగ్యం, పోషకాహారంపై అవగాహన పెంచడానికి ఐసీఎంఆర్‌తో కలిసి పోషణ్ అభియాన్ పేరుతో సరికొత్త అవగాహన కార్యక్రమాన్ని రూపొందించింది. పోషణ్ అభియాన్‌లో భాగంగా బేసిక్స్ ఆఫ్ న్యూట్రీషన్, ఛైల్డ్ ఫీడింగ్, తల్లి ఆరోగ్యం- పోషకాహారం, అనీమియా, యోగా, ఆహారం, ఫిజికల్ అక్టివిటీ తదితర అంశాలపై లఘు చిత్రాలు నిర్మించి వీటిద్వారా ప్రచారం నిర్వహించనున్నారు. హిందీ, ఆంగ్లం, తెలుగు భాషల్లో ఇవి అందుబాటులోకి రానున్నాయి. ఈ లెర్నింగ్ విధానంలో ప్రతీరోజు తీసుకునే ఆహారపదార్ధాలకు సంబంధించిన శాస్త్రీయ సమాచారాన్ని అందించనున్నట్లు ఎన్‌ఐఎన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఎన్‌ఐఎన్ వెబ్‌సైట్ లేదా యాప్‌ద్వారా వీటిని వీక్షించవచ్చు. వీడియోలో కాకుండా వీక్షకులు తమ సందేహాలను నివృత్తి చేసుకునే వీలుకూడా ఉంటుంది

737
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles