హరికృష్ణ మృతితో కన్నీరుమున్నీరైన నిమ్మకూరు

Wed,August 29, 2018 11:19 AM

Nimmakuru recalls Harikrishna memories

హైదరాబాద్: టీడీపీ మాజీ ఎంపీ, సినీ నటుడు హరికృష్ణ మృతితో ఆయన స్వగ్రామం కృష్ణా జిల్లా నిమ్మకూరు కన్నీరుమున్నీరవుతున్నది. ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని అక్కడి వాళ్లు నెమరు వేసుకుంటున్నారు. చిన్ననాటి నుంచి వివాహమయ్యే వరకు హరికృష్ణ నిమ్మకూరులోనే ఉన్నారు. ఆయన చదువంతా అక్కడే సాగింది. స్థానిక అమ్మాయినే పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన హఠాన్మరణం నిమ్మకూరు ప్రజలను కలచివేస్తున్నది. సినిమాల్లో నటిస్తూ, ఎంపీ అయిన తర్వాత కూడా ఎప్పుడు స్వగ్రామానికి వచ్చినా.. అందరితో ఎంతో కలివిడిగా ఉండేవాళ్లని అక్కడివాళ్లు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన ఎంపీగా ఉన్న సమయంలో తన ఎంపీలాడ్స్ నుంచి మూడున్నర కోట్లు మంజూరు చేయించి.. ఊళ్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఎన్టీఆర్ తర్వాత స్వగ్రామంలో ఆస్థాయి చరిష్మా హరికృష్ణకే ఉంది.

2163
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles