రాత్రి వాన.. పొద్దంతా ఈదురు గాలులు

Sun,January 27, 2019 07:07 PM

వరంగల్ అర్బన్: జిల్లాలో శనివారం రాత్రి అకాల వర్షం కురవగా, ఆదివారం పొద్దంతా బలమైన ఈదురుగాలులు వీచాయి. చలిగాలుల తీవ్రతతో ప్రజలు వణికిపోయారు. కమలాపూర్ మండలంలో అత్యధికంగా 35.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 191.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదై సగటున 27.3 మిమీలు చేరింది. అయితే ఆదివారం ఉదయం నుంచి రాత్రి దాకా బలమైన ఈదురుగాలులతో వాతావరణం అంతా చలి తీవ్రత నెలకొన్నది. జనం లేక రోడ్లన్నీ బావురమన్నాయి.

మరోవైపు ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. అత్యల్ప ఉష్ణోగ్రత జిల్లాలో 16 డిగ్రీల సెల్సియస్‌ కాగా, అత్యధిక ఉష్ణోగ్రత కేవలం 21 గానే నమోదైంది. అకాల వర్షానికి ఉద్యానవన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అర్బన్ జిల్లాలో పెద్దగా ఉద్యానవన పంటల విస్తీర్ణం లేకపోయినా అక్కడక్కడా ఏరిన మిర్చి తడిసిపోయింది. ఇప్పటికే పత్తి ఏరటం పూర్తయినా అక్కడక్కడా ఉన్న పత్తికి నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. ఇవాళ సాయత్రం జిల్లాలో అక్కడక్కడా చిరుజల్లులు కురిశాయి.

7016
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles