వైద్యుడి ఇంట్లో ఎన్‌ఐఏ తనిఖీలు

Sat,October 19, 2019 09:38 PM

మంచిర్యాల : మావోయిస్టు రాష్ట్ర నేతలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో మంచిర్యాలకు చెందిన సీనియర్ వైద్యుడు డాక్టర్ కె చంద్రశేఖర్ ఇంట్లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ)కి చెందిన అధికారులు సాయంత్రం తనిఖీలు నిర్వహించారు. అయితే ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మావోయిస్టు రాష్ట్ర నాయకులు కిరణ్‌కుమార్ అలియాస్ కిరణ్‌దాదా, ఆయన భార్య నర్మద అలియాస్ కృష్ణకుమారిలతో వైద్యుడు చంద్రశేఖర్‌కు సంబంధాలు ఉన్నాయన్న అనుమానంతో ఆయన ఇంటిపై ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు.


ఈ తనిఖీల్లో విప్లవ సాహిత్యం, పుస్తకాలు, మావోయిస్టులకు సంబంధించిన వార్తలు ప్రచురమైన పేపర్ కటింగ్‌లు అధికారులకు లభ్యమైనట్లు సమాచారం. వీటితో పాటు కొంత నగదు, సెల్‌ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతేడాది డిసెంబర్‌లో కృష్ణకుమారికి డాక్టర్ చంద్రశేఖర్ వైద్యం అందించాడని తెలుస్తోంది. ఈ విషయమై వైద్యున్ని సంప్రదించేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు.

733
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles