టోల్‌చార్జీలు పెరగనున్నాయి

Wed,March 29, 2017 03:22 PM

NH toll plaza fee increase

తూప్రాన్ : వాహనదారులకు పిడుగులాంటి వార్త. ఏప్రిల్ 1 నుంచి టోల్‌చార్జీలను పెంచుతూ నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ) నిర్ణయం తీసుకుంది. కారు, జీపు, డీసీఎం, మినీ బస్సు తదితర వాహనాలకు రూ.5 నుంచి రూ.10, భారీ వాహనాలకు రూ. 20 నుంచి రూ. 30 వరకు పెరగనున్నాయి. అలాగే టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాల వారికి వాహనాల నెలసరి రుసుం రూ.245 పెరగనుంది. ప్రతియేడాది మార్చి చివరివారంలో టోల్ ధరలను పెంచుతూ భారత జాతీయ రహదారుల సంస్థ ఉత్తర్వులు జారీ చేస్తుంది. జిల్లాలో తూప్రాన్ సమీపంలోని అల్లాపూర్ వద్ద టోల్‌ప్లాజా ఉన్న సంగతి తెలిసిందే.

1924
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles