పెళ్లింట విషాదం.. పెళ్ల‌యిన‌ మరుసటి రోజే రోడ్డు ప్రమాదం

Fri,January 4, 2019 09:44 PM

newly wed couple injured in car accident in adilabad

ఆదిలాబాద్: పెళ్లింట రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. ఆదిలాబాద్ మండలం దేవాపూర్ ఎక్స్ వద్ద జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రాంనగర్ చెందిన మెట్ అశోక్ మొదటి కుమార్తె ప్రియాంక వివాహం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం వడ్యాల్ గ్రామానికి చెందిన అడెపల్లి సాయికుమార్ తో గురువారం వరుడి ఇంటి వద్ద నిర్వహించారు.

ఆదిలాబాద్ లో నిర్వహించనున్న రిసెప్షన్ కోసమని ఉదయం వారు కారులో బయలుదేరారు. ఆదిలాబాద్ మండలం దేవాపూర్ ఎక్స్ వద్దకు చేరుకోగానే ఆదిలాబాద్ నుంచి బరంపూర్ వెళ్లే మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వాళ్లు ప్ర‌యాణిస్తున్న‌ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు నుజ్జునుజ్జు కాగా.. కారులో ప్రయాణిస్తున్న వరుడి మేనత్త రాజమణి, నవదంపతులు సాయికుమార్, ప్రియాంకతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురు సాయికుమార్, రాజేశ్, స్వామి, ప్రణవికి గాయాలయ్యాయి. వీరందరినీ ఆదిలాబాద్ రిమ్స్ కు తరలించగా.. ఇందులో రాజమణి (50) చికిత్స పొందుతూ మృతి చెందింది. నవదంపతుల పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారు అతివేగంగా నడపడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

5911
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles