22వ తేదీ నుంచి టీటీడీ చైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి

Wed,June 19, 2019 05:19 PM

new ttd board chairman YV Subba Reddy oath on 22nd june

తిరుమల: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ పదవికి పుట్టా సుధాకర్‌ యాదవ్‌ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో సంఘాల్‌కు అందజేశారు. కొత్తగా ఏర్పడిని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం వైవీసుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్‌గా నియమించిన సంగతి తెలిసిందే. ఈ నెల 22వ తేదీన ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటికే పలువురు టీటీడీ బోర్డు సభ్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. టీటీడీ బోర్డు కొత్త సభ్యులు కూడా అదే రోజు ప్రమాణ స్వీకరం చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles