రోడ్డుపై చెత్త వేసినందుకు నలుగురికి జరిమానా

Fri,July 19, 2019 09:43 PM

new panchayat raj act in telangana fine four members

జూలపల్లి: చెత్తే కదా అని విచ్చల విడిగా రోడ్లపై పారేస్తే జరిమానాలు తప్పవు. జిల్లాలో ప్రతి శుక్రవారం పరిసరాల పరిశుభ్రతపై అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటూ అవగాహన కల్పిస్తున్న అధికారులు, పెడచెవిన పెట్టి, రోడ్లపై చెత్తవేసిన వారికి కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం జరిమానాలు వేయడం మొదలు పెట్టారు. స్వచ్ఛ భాగంగా పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కోనరావుపేట గ్రామంలో ఇన్‌చార్జి ఎంపీడీఓ రమాదేవి పర్యటించారు. ఈ సందర్భంగా రోడ్డుపై చెత్త నిల్వ చేసి ఉండడాన్ని గమనించి అసహనం వ్యక్తం చేశారు. కొత్త పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సదరు నలుగురు వ్యక్తులకు జరిమానా విధించారు. ఇందులో ఆశా కార్యకర్త మ్యాకల రజిత, మల్లారపు సతీశ్, మల్లారపు మల్లయ్యతోపాటు ఉప సర్పంచ్ కత్తెర్ల వజ్రమ్మలకు రూ. 200 చొప్పున జరిమానా వేశారు.

1106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles