రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...

Wed,March 28, 2018 06:49 PM

New Municipalities in telangana state

హైద‌రాబాద్‌: పురపాలక సవరణ బిల్లును ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తరపున రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై రేపు సభలో చర్చించనున్నారు. 41 పట్టణ స్థానిక సంస్థల్లో 136 గ్రామాల విలీనాన్ని ప్రభుత్వం ప్రతిపాదించింది. కొత్తగా 71 పురపాలికల ఏర్పాటుకు వీలుగా చట్ట సవరణను ప్రతిపాదించింది ప్రభుత్వం. కొత్తగా ఏర్పాటు చేసే మున్సిపాలిటీల్లో 173 గ్రామాలను విలీనం చేస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత గ్రామ పంచాయితీల గడువు ముగిశాక విలీనం చేస్తూ బిల్లును ప్రతిపాదించారు.

ఇవే కొత్త పురపాలికలు

జగిత్యాల జిల్లా


1. రాయికల్
2. ధర్మపురి

జోగుళాంబ గద్వాల్ జిల్లా


3. వడ్డెపల్లే
4. ఆలంపూర్

కరీంనగర్ జిల్లా


5. చొప్పదండి
6. కొత్తపల్లి

కామారెడ్డి జిల్లా


7. ఎల్లారెడ్డి

ఖమ్మం జిల్లా


8. వైరా

మహబూబాబాద్ జిల్లా


9. డోర్నకల్
10. మరిపెడ
11. తొర్రూర్

మహబూబ్‌నగర్ జిల్లా


12. మక్తల్
13. భూత్‌పూర్
14. కోస్గి

మంచిర్యాల జిల్లా


15. నాస్‌పూర్
16. చెన్నూర్
17. క్యాతన్‌పల్లి
18. లక్షెట్టిపేట్

మెదక్ జిల్లా


19. తూప్రాన్
20. రామాయంపేట్
21. నర్సాపూర్

మేడ్చల్ - మల్కాజ్‌గిరి జిల్లా


22. జవహర్‌నగర్
23. దమ్మాయిగూడ
24. నాగారం
25. పోచారం
26. ఘట్‌కేసర్
27. గుండ్ల పోచంపల్లి
28. తుమ్‌కుంట
29. నిజాంపేట్
30. బాచుపల్లి
31. ప్రగతి నగర్
32. కోంపల్లి
33. బౌరంపేట్
34. దుండిగల్

నల్గొండ జిల్లా


35. నకిరెకల్
36. విజయపురి నార్త్
37. చిట్యాల్
38. హాలియా
39. చండూర్

నిర్మల్ జిల్లా


40. ఖానాపూర్
నిజామాబాద్ జిల్లా
41. భీమ్‌గల్

పెద్దపల్లి జిల్లా


42. మంథని
43. సుల్తానాబాద్

రంగారెడ్డి జిల్లా


44. శంషాబాద్
45. తుర్కయాంజల్
46. మణికొండ
47. నార్సింగి
48. బండ్లగూడ జాగిర్
49. ఆదిబట్ల
50. శంకర్‌పల్లి
51. తుక్కుగూడ
52. అమన్‌గల్

సంగారెడ్డి జిల్లా


53. నారాయణ్‌ఖేడ్
54. బొల్లారం
55. తెల్లాపూర్
56. అమీన్‌పూర్

సిద్దిపేట జిల్లా


57. చేర్యాల

సూర్యాపేట జిల్లా


58. నేరెడు చర్ల
59. తిరుమలగిరి

వికారాబాద్


60. పరిగి
61. కొడంగల్

వరంగల్ రూరల్ జిల్లా


62. వర్ధన్నపేట్

వనపర్తి జిల్లా


63. కొత్తకోట
64. పెబ్బేరు
65. ఆత్మకూర్
66. అమర్‌చింత

యాదాద్రి భువనగిరి జిల్లా


67. మోత్కూర్
68. చౌటుప్పల్
69. ఆలేర్
70. పోచంపల్లి
71. యాదగిరిగుట్ట

13176
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles