కొత్తగా ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఏర్పాటు

Fri,July 19, 2019 11:47 AM

new municipal corporations in telangana state

హైదరాబాద్ : తెలంగాణ మున్సిపాలిటీ చట్టం - 2019పై చర్చ సందర్భంగా శాసనసభలో సీఎం కేసీఆర్ ప్రసంగింస్తూ.. కొత్త మున్సిపల్ కార్పొరేషన్లు కొన్ని ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. బడంగ్‌పేట, బండ్లగూడ జాగీర్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్‌నగర్, నిజాంపేట్‌తో పాటు మీర్‌పేట్, జిల్లెలగూడను కలిపి మీర్‌పేట మున్సిపాలిటీలను మున్సిపల్ కార్పొరేషన్లుగా ఈ చట్టం ద్వారానే ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీని వల్ల జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, ఈ కొత్త కార్పొరేషన్ల మధ్య సామరస్యం పెరిగి మంచి ఫలితాలు రాబట్టగలుగుతాయి. స్థానిక శాసనసభ్యుల అభ్యర్థనల మేరకు ఈ కార్పొరేషన్లు ఏర్పాటు చేశాం. రాష్ట్రంలో మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లు, పట్టణాభివృద్ధి సంస్థలు మాత్రమే ఉంటాయి. పారదర్శకంగా అనుమతులు లభించేందుకు వీలుగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రిగా పూర్తి అవగాహనతో ఈ చట్టం రూపకల్పన చేశాం. చట్టంలోని ప్రతి వాక్యం నేనే రాయించాను అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

4790
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles