రేపే కొత్త ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం

Sun,April 14, 2019 08:09 PM

new MLCs will be sworn in on 15th

హైదరాబాద్‌: రేపు ఉదయం 11 గంటలకు శాసనమండలిలో నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్సీలు ప్రమాణస్వీకారం చేయనున్నారు. మండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ నేతి విద్యాసాగర్‌ వారితో ప్రమాణం చేయిస్తారు. శాసన సభ్యుల కోటా కింద హోం మంత్రి మహమూద్ అలీ, శేరి సుభాష్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, యెగ్గె మల్లేశంలు టీఆర్ఎస్‌ తరఫున, మీర్జా రియాజ్‌ హసన్‌ మజ్లిస్‌ నుంచి గెలిచారు. నల్గొండ-వరంగల్‌-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి నర్సిరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి కూర రఘోత్తంరెడ్డి, కరీంనగర్‌-మెదక్‌- నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్ర నియోజకవర్గం నుంచి జీవన్‌రెడ్డి విజయం సాధించారు. సోమవారం వీరి ప్రమాణ స్వీకారం కోసం శాసనమండలి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

2396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles