ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రారంభం

Sun,June 16, 2019 05:43 PM

New MLA camp office inaugurated at narsampet constituency

వరంగల్ రూరల్: జిల్లాలోని నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే క్యాపు కార్యాలయాన్ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రారంభించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, జిల్లా కలెక్టర్ హరిత, జిల్లా ఎస్పీ, అధికారులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ... నియోజకవర్గ ఎమ్మెల్యేలు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా క్యాంపు కార్యాలయాలు రూపొందించామన్నారు. ప్రజల సమస్యలు గ్రామాల్లోకి వెళ్లి తెలుసుకోవడమే కాకుండా కార్యకర్తలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావాలన్నారు. ఎమ్మెల్యే అందుబాటులో లేనప్పుడు, గ్రామాల్లో పర్యటిస్తున్నప్పుడు క్యాంపు కార్యాలయంలో ఉండే సిబ్బంది ప్రజల ఇబ్బందులను దూరం చేసేందుకు పనిచేస్తామని తెలిపారు.

2257
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles