న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ సీజ్

Fri,August 3, 2018 10:05 AM

New Century Public School seize

హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో గల న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్‌ను జీహెచ్‌ఎంసీ సిబ్బంది సీజ్ చేశారు. పాఠశాలలో నిన్న కల్చరల్ స్టేజీ కూలి ఇద్దరు విద్యార్థినులు మృతిచెందిన విషయం తెలిసిందే. స్కూల్ సీజ్‌తో విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఈవో విజయకుమారి తెలిపారు. విద్యార్థులు విద్యా సంవత్సరం కోల్పోకుండా చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ సెంచరీ పబ్లిక్ స్కూల్ విద్యార్థులను సమీప పాఠశాలలో చదివిస్తామని చెప్పారు. ఆయా పాఠశాలలతో మాట్లాడి తల్లిదండ్రులపై భారం పడకుండా చర్యలు తీసుకుంటామన్నారు. పాఠ్యాంశాల విషయంపై కూడా విద్యార్థులు ఆందోళన చెందనక్కర్లేదని డీఈవో పేర్కొన్నారు.

2435
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles