ముళ్లపొదల్లో పసికందు

Thu,November 14, 2019 09:05 PM

అశ్వారావుపేట : ముళ్లపొదల్లో పసికందును ఓ తల్లి కనికరం లేకుండా వదిలేసింది. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతారం సమీపంలో గ్రామస్తులు ముండ్ల పొదల్లో నవజాత శిశువును గుర్తించారు. సమాచారం అందుకున్న ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సౌజన్య పసికందును అశ్వారావుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఉన్నతాధికారులకు అదేశాల మేరకు శిశువు బాధ్యతలను అశ్వారావుపేట శిశు గృహం నిర్వాహకులకు అప్పగించారు. ఎస్పీ సునీల్‌దత్ అశ్వారావుపేట పర్యటనలో భాగంగా శిశువుగా దొరికిన విషయం తెలుసుకుని ఆస్పత్రికి వచ్చి పరిశీలించారు. శిశువుగా అరోగ్యంపై వైద్యాధికారులను ఆరా తీశారు. ఐసీడీఎస్ అధికారుల పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ అబ్బయ్య తెలిపారు.

814
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles