న్యాక్‌లో ఏడు వృత్తుల్లో కొత్త బ్యాచ్‌లు ప్రారంభం

Wed,November 21, 2018 08:13 AM

New batches in seven professions in NAC

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం స్థాపించిన నేషనల్ అకాడమీ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ (న్యాక్), పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణలోని పట్టణ ప్రాంతానికి చెందిన యువకులకు ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించనుంది. ఏడు వృత్తుల్లో కొత్త బ్యాచ్‌లకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ మంగళవారం ప్రకటన విడుదల చేసింది. తెలంగాణలోని పట్టణ ప్రాంతానికి చెందిన 18 నుంచి 36 ఏండ్లలోపు నిరుద్యోగులకు నిర్మాణ రంగానికి చెందిన వృత్తుల్లో మూడు నెలల ఉచిత శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. పదోతరగతి విద్యార్హత ఉన్నవారికి ప్లంబర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, సోలార్ ఇన్‌స్టాల్ వృత్తుల్లో, 12వ తరగతి విద్యార్హత ఉన్నవారికి ఎలక్ట్రీషియన్, ల్యాండ్ సర్వేయర్, అసిస్టెంట్ వర్క్‌సూపర్‌వైజర్ వృత్తుల్లో శిక్షణ ఇవ్వనున్నట్టు వివరించారు. ఆసక్తిగల వారు న్యాక్‌కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. శిక్షణ సమయంలో ఉచిత భోజనవసతి, పుస్తకాలు, యూ నిఫాం, షూస్, హెల్మెట్ వంటివి ఇస్తామని పేర్క్నొరు. ఆసక్తిగల అభ్యర్థులు ఆధార్ లేదా రేషన్‌కార్డు, స్టడీ, క్యాస్ట్ సర్టిఫికెటు జిరాక్స్ కాపీలతోపాటు, ఆరు పాస్‌పోర్టు సైజు ఫొటోలతో న్యాక్‌ను సంప్రదించాలని కోరారు. వివరాల కోసం 7989050888, 8328622455 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.

1108
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles