మినిస్టర్ కేటీఆర్.. కంగ్రాట్స్Mon,December 18, 2017 11:59 AM
మినిస్టర్ కేటీఆర్.. కంగ్రాట్స్

హైదరాబాద్ : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ చెబుతూనే ఉన్నారు. కేటీఆర్ ట్విట్టర్ పేజీలో శుభాకాంక్షల వరద ప్రవాహం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే పలు జాతీయ అవార్డులను దక్కించుకొన్న కేటీఆర్‌కు మరో ప్రతిష్టాత్మకమైన అవార్డు రావడంతో ఆయనకు శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. కంగ్రాట్స్ చెప్పిన వారందరికీ కేటీఆర్ థ్యాంక్స్ చెబుతూ రీట్వీట్ చేస్తున్నారు.
ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ ఏటా ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేటీఆర్‌కు ప్రకటించిన విషయం విదితమే. పట్టణ మౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణను ఎంపిక చేసింది. ఈ నెల 20వ తేదీన న్యూఢిల్లీలో ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నూతన రాష్ట్రాన్ని మంత్రి కేటీఆర్ దేశ యవనికపై తనదైన శైలిలో నిలిపిన తీరును బిజినెస్ వరల్డ్ అభినందించింది. పాలనాపరంగా ఆయన నిర్వహిస్తున్న బాధ్యతలు, రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నతీరు, దేశవ్యాప్తంగా మంత్రికి లభించిన పేరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ అవార్డు ఇస్తున్నట్టు బిజినెస్ వరల్డ్ తెలిపింది. పట్టణ మౌలిక వసతులున్న ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డును అందించనున్నది.

పట్టణాల్లో మిషన్ భగీరథ (అర్బన్) ద్వారా ఇంటింటికి రక్షిత తాగునీరు అందించే కార్యక్రమాన్ని బిజినెస్ వరల్డ్ ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితహారం, డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఈ అవార్డు ఇస్తున్నట్టు ప్రకటిం చింది. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని పట్టణాల్లో అమలుచేయటం, హైదరాబాద్ నగరంలోనే లక్ష డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టడం ద్వారా పేద ప్రజలకు పక్కాగృహాలు సమకూర్చేందుకు చేస్తున్నకృషిని పరిగణనలోకి తీసుకొన్నట్టు బిజినెస్ వరల్డ్ వివరించింది.1784
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS