ఐరాసలో మిమిక్రీ చేసిన మొదటి వ్యక్తి నేరెళ్లనే

Tue,June 19, 2018 12:37 PM

Nerella Venu Madhav mimic at United Nations

మిమిక్రీ కళకు ఆద్యుడిగా నిలిచి, ప్రపంచవ్యాప్తంగా వేలాది ప్రదర్శనలిచ్చిన వేణుమాధవ్ దేశమంతటికీ సుపరిచితుడు. ఐక్యరాజ్యసమితిలో మిమిక్రీ ప్రదర్శించిన మొట్టమొదటి కళాకారుడిగా వేణుమాధవ్ చరిత్రలో నిలిచిపోయారు. వేలాది మందిని మిమిక్రీ కళాకారులుగా తయారుచేసిన వేణుమాధవ్, "భారత మిమిక్రీ పిత" గా పేరొందారు. ముఖ్యంగా దేశ నాయకులు, ప్రపంచ నాయకుల గళాన్ని అనుకరించడంలో దిట్ట. తన గొంతును యధాతథంగా అనుకరించడంతో నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఎంతో ముగ్ధులై, నేరెళ్లను ఆలింగనం చేసుకున్నారు. పురుషులై ఉండి కూడా దివంగత ప్రధాని ఇందిరాగాంధి గళాన్ని అద్భుతంగా మిమిక్ చేసారు.నేటికీ ఆయన జన్మదినమైన డిసెంబర్ 28ని 'ప్రపంచ మిమిక్రీ దినోత్సవం' గా తన శిష్యులు ఘనంగా జరుపుకుంటారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న నేరెళ్ల వేణుమాధవ్ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచిన విషయం విదితమే.

1157
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles