దేశంలోనే అగ్రగామిగా నెహ్రూ జూపార్క్‌..

Mon,June 3, 2019 08:48 PM

Nehru Zoo park to be number one in Countryహైద‌రాబాద్ : నెహ్రూ జువాలాజికల్ పార్క్ ను దేశంలోనే అగ్రగామిగా నిలిపేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అటవీ, పర్యావరణ, న్యాయ‌, దేవాదాయ‌ మంత్రి అల్లోల‌ ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇవాళ జూపార్క్ లో జూస్‌ అండ్‌ పార్క్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (జపాట్‌) గవర్నింగ్‌ బాడీ సమావేశంలో తెలంగాణలోని 8 జూ లు, పార్కుల తీరుతెన్నులను మంత్రి అల్లోల సమీక్షించారు. జూపార్క్‌ను దేశంలోనే టాప్‌లో నిలిపేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. నగరంలోని నెహ్రూ జ్యూలాజికల్ పార్కుతో సహా రాష్ట్రంలోని తొమ్మిది జూ పార్కుల్లో సందర్శకులకోసం మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.

జూపార్కుల్లో భద్రత చర్యలు, నెహ్రూ జూపార్కులో సీసీ కెమెరాల ఏర్పాటు, ఆన్‌లైన్‌ టికెటింగ్‌, సందర్శకులకు అన్ని వసతుల తో ఫుడ్‌కోర్టు, త‌దిత‌ర ఏర్పాట్ల‌పై అధికారులు మంత్రికి వివ‌రించారు. టెక్ మ‌హీంద్ర కంపెనీ సామాజిక బాధ్యత కింద రూ.1 కోటితో జూ పార్క్ ఎంట్రీ గేట్ పున‌రాకృతి, ఫుడ్ కోర్టు నిర్మాణం చేప‌ట్టేందుకు ముందుకు రాగా..బోర్డు దానికి అనుమ‌తినిచ్చింది. రోజు రోజుకు జూకు వ‌చ్చే సంద‌ర్శకులు పెరుగుతున్న నేప‌థ్యంలో 2020-2040 పేరుతో ప‌లు అభివృద్ది కార్య‌క్ర‌మాలు చేప‌ట్టేందుకు రూపోందించిన మాస్ట‌ర్ ప్లాన్ ను బోర్డు ముందుంచారు. దీనిపై ఈ స‌మావేశంలో చ‌ర్చించారు. ఈ సమావేశంలో ఈ కార్య‌క్ర‌మంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ మిశ్రా, పీసీసీఎఫ్ ప్రశాంత్‌కుమార్ ఝా, అద‌న‌పు పీసీసీఎఫ్ మునీంద్ర‌, జూ పార్కుల డైరెక్ట‌ర్ సిద్దానంద్ కుక్రేటి, సీసీఎఫ్ అక్బ‌ర్, ఒఎస్‌డి శంకరన్, జూ పార్క్ క్యూరేటర్ క్షితిజ, బోర్డు స‌భ్యులు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


2118
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles