నౌకాదళ నావికుడు ఆకాశ్ ఆత్మహత్య.. నిర్మల్ జిల్లా పార్డి(బి) గ్రామంలో విషాదం

Thu,June 6, 2019 10:39 PM

Navy sailor hails from telangana commits suicide in pune

నిర్మల్: జిల్లా కుభీర్ మండలంలోని పార్డి(బి) గ్రామానికి చెందిన కన్నాల ఆకాశ్(20) అనే నావికాదళ నావికుడు మహారాష్ట్రలోని పుణే జిల్లా లోనావాలా భారత నౌకాదళ స్థావరంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

తల్లిదండ్రులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. కన్నాల సాయినాథ్-భోజవ్వ దంపతుల ప్రథమ సంతానమైన ఆకాశ్ తొమ్మిది నెలల క్రితం నేవిలో ఉద్యోగంలో చేరాడు. శిక్షణలో భాగంగా నౌకాదళంలో డైరెక్ట్ ఎంట్రీ ఇంజినీరింగ్ మెకానిక్స్ కోర్సులో శిక్షణ పొందుతున్నాడు. బుధవారం తెల్లవారు జామున స్థావరంలోని ఐఎన్‌ఎస్ శివాజీ వద్ద ఆయన శవమై కనిపించినట్లు అక్కడి నౌకాదళ అధికారులు తెలిపినట్లు గ్రామస్తులు తెలిపారు. స్థావరంలోని రిక్రియేషన్ కేంద్రంలో ఆకాశ్ బెడ్‌షీట్‌తో రూంలోని సీలింగ్ ఫ్యానుకు ఉరివేసుకున్నట్లు తెలిపారు.

ఆకాశ్ తల్లిదండ్రులకు పెద్ద కుమారుడు కావడంతో కుటుంబం ఆయన పైనే ఆశలు పెంచుకున్నారు. పేదకుటుంబంలో జన్మించిన ఆకాశ్ ఒకటో తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రభుత్వ పాఠశాలల్లోనే చదువుకుని నేవీకి ఎంపికయ్యాడు. ప్రయోజకుడు అయ్యాడని అనుకున్న తల్లిదండ్రులకు కన్నీళ్లు మాత్రమే మిగిల్చి కానరాని లోకాలకు వెళ్లిపోవడం, ఆకాశ్ తమ్ముడు అన్వేష్, చెల్లెలు సోని చదువులు వాడే చూస్తాడని మాబాధ్యత తీరిందని అనుకుంటూ రోదించిన తీరు అక్కడి వారందరిని కలిచి వేసింది. ఆకాశ్ మృతిని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు జీర్ణించుకోలేక పోయారు.

1057
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles