శస్త్ర ప్రయోగ నృత్యరత్నావళిపై జాతీయ సెమినార్

Tue,January 15, 2019 06:04 PM

National Seminar at Kakatiya Heritage Trust

వరంగల్ అర్భన్ : ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఆఫ్ ది ఆర్ట్స్, న్యూ ఢిల్లీ మరియు కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్, వరంగల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో "శస్త్ర ప్రయోగ నృత్యరత్నావళి'' అనే అంశంపై హన్మకొండ కాకతీయ హరిత హోటల్ నందు ఈనెల 16,17 తేదీల్లో రెండురోజుల జాతీయ సెమినార్ జరగనుంది. 16న ఉదయం 9.30 గంటలకు రెండు రోజుల జాతీయ సెమినార్ ప్రారంభం కానుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్, రాష్ట్ర ప్రభుత్వ మాజీ సలహాదారు బి.వి. పాపారావు, డా.జాన్ గై(న్యూయార్క్), డా. అద్వితవాదిని కౌల్(జమ్మూకశ్మీర్), భరత్ భూషణ్ శర్మ(న్యూఢిల్లీ), తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. బెంగుళూరు, ఢిల్లీ, హైదరాబాద్, వరంగల్ తో పాటు తదితర ప్రాంతాలకు చెందిన కళాకారులు, సాహిత్య విమర్శకులు, చరిత్ర పరిశోధకులు ఈ సెమినార్ లో పాల్గొననున్నారు.

1468
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles