రేపటినుంచి నేషనల్ శాంపిల్ సర్వే శిక్షణ

Sun,December 16, 2018 07:55 AM

National Sample Survey Training from tomorrow

హైదరాబాద్ : రైతు కుటుంబాల స్థితిగతులపై అధ్యయనం చేసేందుకు నిర్వహించనున్న నేషనల్ శాంపిల్ సర్వే కోసం 105 మందికి సోమవారం (17వ తేదీ) నుంచి ఈ నెల 20 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. ఓయూ ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటినరీ హాల్‌లో ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాన్ని డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డీ సతీశ్, డిప్యూటీ డైరెక్టర్ నాగమల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రారంభించనున్నారు. రైతు కుటుంబాల భూమి, పశుసంపద, పెట్టుబడులు, రుణాలు వంటి పలు అంశాలపై ఏడాదిపాటు సర్వే చేయనున్నారు. సామాజిక ఆర్థిక సూచికలను రూపొందించే నేషనల్ శాంపిల్ సర్వే సంస్థ.. 2019 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు సర్వే చేయనుంది. సర్వేను విజయవంతంగా పూర్తిచేసేందుకు కేంద్ర, రాష్ట్రాల ఆర్థికశాఖ అధికార బృందాలు ఈ శిక్షణను ఏర్పాటుచేశాయి. మొదటి మూడురోజులు థియరీ, చివరిరోజు ప్రాక్టికల్స్‌పై శిక్షణ ఇవ్వనున్నాయి.

1503
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles