వ్యర్థాల నిర్వహణపై జాతీయ సదస్సు ప్రారంభం

Mon,August 27, 2018 11:08 AM

హైదరాబాద్: నగరంలోని శిల్పకళావేదికలో వ్యర్థాల నిర్వహణపై జాతీయ సదస్సు ప్రారంభమైంది. నేటి నుంచి రెండ్రోజులపాటు సదస్సు నిర్వహణ. జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో శిల్పకళావేదికలో నిర్వహిస్తున్న ఈ సదస్సుకు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ కమిషనర్లు దానకిశోర్, జనార్దన్‌రెడ్డి హాజరయ్యారు. నేషనల్ వేస్ట్ ఆల్టర్నేటివ్ కాంక్లేవ్ సస్టేయినబుల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ ప్రాక్టీసెస్-2018 పేరుతో సదస్సును నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రధాన సమస్యగా మారుతున్న వ్యర్థాల నిర్వహణను ఎలా చేపట్టాలనే అంశాలపై సమగ్రంగా చర్చించనున్నారు. నగరపాలక సంస్థలు, స్థానికసంస్థల్లో వ్యర్థాల నిర్వహణకు ఉపయోగించాల్సిన విధానాలను తెలుసుకునేందుకు ఈ సదస్సు వేదిక కానున్నది. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, ఉపయోగించిన ప్లాస్టిక్ వస్తువులను వేర్వేరు రూపాల్లో తిరిగి ఉపయోగంలోకి తేవడం, ఉత్తమ ఘన పదార్థాల నిర్వహణ, పరికరాలు సదస్సులో ప్రదర్శించనున్నారు. ఆయా రంగాల్లో ఎంతో కాలంగా పనిచేస్తున్న యూనివర్సిటీలు, స్వచ్ఛంద సంస్థలు, పలు రాష్ర్టాల అధికారులు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు.

815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles