రేపు, ఎల్లుండి స్వచ్ఛ ఐకానిక్‌పై జాతీయ సదస్సు

Sun,June 24, 2018 07:19 AM

National Convention on Swachh Iconic

హైదరాబాద్ : దేశంలోని ప్రముఖ చారిత్రక పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ ఐకానిక్ ప్రాంతాలపై ఈ నెల 25, 26 తేదీల్లో హైదరాబాద్ నగరంలో రెండు రోజుల జాతీయ సదస్సును నిర్వహించనున్నారు. జీహెచ్‌ఎంసీ, కేంద్ర ప్రభుత్వ తాగునీరు, పారిశుధ్య మంత్రిత్వశాఖ సంయుక్తాధ్వర్యంలో నిర్వహించే ఈ సందస్సులో 30 ఐకానిక్ నగరాలకు ప్రాతినిధ్యం వహించే ఉన్నతాధికారులతో పాటు వివిధ రాష్ర్టాలకు చెందిన 150 మందికిపైగా జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, డైరెక్టర్లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కే.జోషి ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారు. పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ డాక్టర్ బి. జనార్దన్‌రెడ్డి తదితర ప్రముఖులు పాల్గొంటారు.

755
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles