ప్రజలు మాపై మరోసారి భరోసా ఉంచారు....

Sat,May 25, 2019 06:58 PM

Narendra Modi addresses the NDA meeting

ఢిల్లీ: పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో ఎన్డీఏ ఎంపీలు సమావేశమయ్యారు. కరతాళ ద్వనులతో మోదీకి ఎండీఏ ఎంపీలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ... ఎన్డీఏ నేతగా ఎన్నుకున్నందుకు ధన్యవాదాలు. విజయం సాధించిన ఎన్డీఏ మిత్రులకు ప్రత్యేక అభినందనలు. తొలిసారి లోక్‌సభ సభ్యులుగా గెలిచిన వారికి అభినందనలు. క్లిష్టమైన ఎన్నికల ప్రక్రియను ఈసీ విజయవంతంగా నిర్వహించింది. సార్వత్రిక ఎన్నికలను ప్రపంచం అంతా ఆసక్తిగా గమనించింది. ఈ ఐదేళ్లలో భారత్ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేశాం. ఈ మహత్తర విజయంతో ప్రజలు మనకు గురుతర బాధ్యత అప్పజెప్పారు. ఆధునిక భారత్ దిశగా మన ప్రయాణం ప్రారంభించాం.

ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు సరికొత్త ఉత్సాహంతో ముందుకెళ్తాం. భారత్ ప్రజాస్వామ్యం పరిణతి దిశగా పయనిస్తోంది. ఎంత ఉన్నతస్థితికి చేరినా సేవాభావం మరిచిపోం. సేవాభావం ఉన్నంత వరకు ప్రజాదరణ మనకు ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా ఎన్డీఏ విజయాన్ని కాంక్షించారు. మా చిత్తశుద్ధి, సుపరిపాలన చూసే ప్రజలు ఓటేశారు. నేను కూడా మీలో ఒకడినే అని భావించండి. ఈ ఎన్నికల్లో మా ప్రచారాస్త్రం సమత, మమత. ఈసారి ఎన్నికల్లో ప్రజలు కూడా భాగస్వాములయ్యారు. ఒక్క పిలుపు ఇస్తే కోటి 25 లక్షల మంది గ్యాస్ రాయితీ వదులుకున్నారు. ప్రజలు మాపై మరోసారి భరోసా ఉంచారని తెలిపారు.

1923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles