సామాజిక రుగ్మతలను దూరం చేయడమే లక్ష్యం : నారదాసుFri,April 21, 2017 04:35 PM

సామాజిక రుగ్మతలను దూరం చేయడమే లక్ష్యం : నారదాసు

హైదరాబాద్ : టీఆర్‌ఎస్ ప్లీనరీలో సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు ప్రవేశపెట్టారు. అస్థిత్వ ఆకాంక్ష స్వాతంత్య్రానికి దారితీస్తే.. ఆత్మగౌరవ ఆకాంక్ష తెలంగాణ ఉద్యమానికి దారి తీసిందన్నారు. 2001లో ప్రారంభమైన తెలంగాణ ఉద్యమం.. సకల జనులను ఏకం చేసి 2014లో తెలంగాణను సాధించి పెట్టారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రజలు రాజకీయంగా, భౌగోళికంగా విముక్తి కావడం జరిగిందన్నారు. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ప్రజలు ఎదగాలన్నారు. అంతేకాకుండా బంగారు తెలంగాణను సాధించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో బంగారు తెలంగాణను సాధిస్తామన్న నమ్మకం ఉందన్నారు. ప్రజల సమస్యలే ఇతివృత్తంగా సీఎం కేసీఆర్ పాలనను కొనసాగిస్తున్నారని స్పష్టం చేశారు.
TRS PLENARY 2017 Photo Gallery
ప్రభుత్వ సంక్షేమ పథకాలు అట్టడుగు ప్రజలకు చేరేలా సీఎం కృషి చేస్తున్నారని ఉద్ఘాటించారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉందన్నారు. సామాజిక రుగ్మతలు, సాంఘిక దురాచారాలు సమాజాన్ని పట్టిపీడిస్తున్నాయని తెలిపారు. మానవవనరులను తీర్చిదిద్దుకోకపోతే అభివృద్ధి, సంక్షేమ ఫలితాలు అందవు అని అన్నారు. సామాజిక రుగ్మతలను దూరం చేసేందుకు సంక్షేమ పథకాలను సీఎం తీసుకువస్తున్నారని స్పష్టం చేశారు. గుడుంబా, పేకాట, కల్తీ కల్లు, ఈవ్‌టీజింగ్ సమాజాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మతలు అని తెలిపారు. దుర్వాసనలను ఆరికట్టేందుకు సీఎం చర్యలు చేపట్టారు. ఈవ్‌టీజింగ్‌ను అరికట్టేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. మహిళలపై వేధింపులను అరికట్టేందుకు షీటీమ్స్‌ను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. మహిళలు పని చేసే చోట వారికి రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు.

పేకాటతో చాలా కుటుంబాలు రోడ్డున పడ్డాయన్నారు. భార్య మెడలో ఉన్నటువంటి పుస్తెలను అమ్ముకునే పరిస్థితిని చూస్తున్నాం. పేకాట ఆట కాదు.. కుటుంబాలను కూల్చే ఆటం బాంబు అని పేర్కొన్నారు. పేకాటను ఆరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. గుడుంబా, కల్తీ కల్లు విక్రయిస్తున్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ నారదాసు ప్రవేశపెట్టిన సామాజిక రుగ్మతలపై సమరం తీర్మానాన్ని ప్రభుత్వ విప్ గొంగిడి సునీత బలపరిచారు.

444
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS