తెలుగు ప్రజలకిది గొప్ప పండుగ : సిద్ధారెడ్డి

Tue,December 19, 2017 06:59 PM

హైదరాబాద్ : ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించుకోవడం తెలుగు ప్రజలకు గొప్ప పండుగ అని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి పేర్కొన్నారు. తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో సిద్ధారెడ్డి స్వాగతోపన్యాసం చేశారు. తెలుగు మహాసభలు రాబోయే తరాలకు మార్గదర్శకంగా నిలిచాయన్నారు. ఈ ఐదు రోజుల పాటు నిర్విరామంగా ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలు, పుస్తకావిష్కరణలు, అవధానాలు జరిగాయి. ఈ మహాసభలకు 42 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని తెలిపారు. ప్రపంచ తెలుగు మహాసభలు వర్ధిల్లాలని సిద్ధారెడ్డి చెప్పారు. తెలుగు మహాసభల్లో తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించాయని ఆయన తెలిపారు.

1980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles