రేవంత్‌రెడ్డిని అడ్డుకున్న నందిగామ గ్రామస్తులు

Wed,February 28, 2018 03:07 PM

Nandigama people fire on MLA Revanth reddy

మహబూబ్‌నగర్ : జిల్లాలోని మద్దూరు మండలం నందిగామలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గోకుల్‌నగర్ పీఆర్ రోడ్డు నుంచి నందిగామ వరకు బీటీ రోడ్డు పనుల ప్రారంభానికి ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి, ఆయన అనుచరులు ధ్వంసం చేశారు. మంత్రులు జూపల్లి కృష్ణారావు, మహేందర్‌రెడ్డి రాకముందే ఈ ఘటన చోటు చేసుకోవడంతో.. మంత్రులు ఆగ్రహం వెలిబుచ్చారు. రేవంత్‌రెడ్డిని గ్రామస్తులు అడ్డుకోవడంతో.. ఓ బైక్‌పై ఎక్కి ఎమ్మెల్యే అటు నుంచి వెళ్లిపోయారు. శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన రేవంత్‌రెడ్డిని అరెస్టు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. డీఎస్పీ, సీఐ, ఎస్‌తో గ్రామస్తులు వాగ్వాదానికి దిగారు. రేవంత్‌కు పోలీసులు వత్తాసు పలుకుతున్నారని మంత్రులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో గాయపడిన రామకృష్ణారెడ్డి, మరో ఇద్దరు వ్యక్తులను మంత్రులు పరామర్శించారు.

4795
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles