నమస్తే తెలంగాణ-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం క‌థ‌ల‌పోటీ 2019

Tue,June 18, 2019 08:20 PM

Namasthe telangana to Conduct Stories Competition

నమస్తే తెలంగాణ
ముల్కనూరు ప్రజాగ్రంథాలయం

[ముల్కనూరు, భీమదేవరపల్లి(మం), వరంగల్ అర్బన్ జిల్లా]
సంయుక్త నిర్వహణలో
కథల పోటీ - 2019
1,60,000 రూపాయల విలువైన
బహుమతులు

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మనసునిండుగా పులుముకుని,
గత చరిత్రకు వర్తమాన చరితను జతచేస్తూ భవిష్యత్ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగమవుతున్నది నమస్తేతెలంగాణ.
మన మట్టి వాసనకు కొత్త చొబకులద్దుతూ నమస్తేతెలంగాణ, ముల్కనూరు ప్రజాగ్రంథాలయం సంయుక్త నిర్వహణలో
తొలిసారి కథలపోటీని నిర్వహిస్తున్నది. 22 కథలకు 1,60,000 వేల విలువైన బహుమతులు అందించనున్నది.
ఈ పోటీలో మనమూ భాగస్వాములవుదాం
రండి మన కలాలకు కొత్త రంగులద్దుదాం- తెలంగాణ కథలకు భోనమెత్తుదాం.

బహుమతుల వివరాలు
ప్రథమ బహుమతి (ఒక్కరికి) - రూ. 50,000
2 ద్వితీయ బహుమతులు (ఒక్కొక్కరికి) - రూ. 25,000
3 తృతీయ బహుమతులు (ఒక్కొక్కరికి) - రూ. 10,000
6 కన్సొలేషన్ బహుమతులు (ఒక్కొక్కరికి) - రూ. 5,000
(మొత్తం 1 లక్షా 60 వేల రూపాయలు)

పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన 22 కథలను ఎంపిక చేస్తాం.

పోటీ ప్రధాన ఉద్దేశం
తెలంగాణ సంస్కృతి, చరిత్ర,
సమకాలీన జీవన వైవిధ్యాల, వైరుధ్యాల
నేపథ్యంలో కథ ఉండాలి. నవ్యతకు,
సృజనాత్మకతకు పెద్దపీట వేసే కథలకు మాత్రమే ఆహ్వానం పలుకుతున్నాం.

నియమ నిబంధనలు
ఇంతకు ముందు ఎక్కడా (ప్రింట్ పత్రికలలో గానీ, వెబ్ పత్రికలలో గానీ, వ్యక్తిగత బ్లాగులలో గానీ, సోషల్ మీడియాలోగానీ) ప్రచురితం కాని కథలను మాత్రమే పోటీకి పంపాలి.
ఇప్పటికే ఎక్కడైనా పరిశీలనలో ఉన్న రచనలు పోటీకి అనర్హం.
పై అంశాలను ధృవీకరిస్తూ హామీపత్రం తప్పనిసరిగా జతపరచాలి.
ప్రచురణకు అంగీకరించని రాతప్రతులను తిరిగి పంపడం సాధ్యం కాదు.
ఒకరు ఎన్ని కథలైనా పంపొచ్చు.
రచనకు ఏ కలం పేరు వాడినా రచయిత / రచయిత్రి అసలు పేరు, పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ తప్పనిసరిగా
హామీ పత్రంలో రాయాలి.
కథ అనువాదంగానీ, అనుకరణగానీ, అనుసరణకానీ కాదని హామీపత్రంలో స్పష్టం చేయాలి.
పోటీలో ఏ బహుమతి పొందిన కథనైనా, ఫలితాలు వెలువడిన తరువాత వెనక్కి తీసుకునే అవకాశం కథా రచయితలకు లేదని గమనించగలరు.
బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదు.
రచయితలకు ప్రాంతీయ భేదం లేదు.
ఏ రాష్ట్రమైనా, ఏ దేశంలో ఉన్న తెలుగు వారైనా కథలు పంపవచ్చు.

పంపాల్సిన విధానం
రాత ప్రతి అయితే కథ 10 పేజీలు మించకుండా ఉండాలి.
ఈ-మెయిల్ ద్వారా పంపేవారు యూనికోడ్‌లో వర్డ్‌ఫైల్ పంపవచ్చు. దాన్ని పీడీఎఫ్‌లోకి కూడా మార్చి ఎటాచ్ చేయాలి.
పేజ్‌మేకర్‌లో డీటీపీ చేయించి కథను పంపేవారు
పీఎమ్‌డీ ఫైల్‌ను, పీడీఎఫ్‌ను కూడా జత చేసి ఆ రెండింటినీ ఈ-మెయిల్‌లో ఎటాచ్ చేసి పంపాలి.
డీటీపీ, వర్డ్‌ఫైల్ ఏ4 సైజులో 14 నుంచి 16 ఫాంట్‌లో నాలుగు, ఐదు పేజీలకు మించకూడదు.
పదాల్లో అయితే కథ 1500 పదాలకు మించకూడదు.
హామీపత్రం జత చేయడం మర్చిపోవద్దు.
కథల ప్రతులపైన రచయిత / రచయిత్రి పేరు
ఉండరాదు. విడిగా హామీపత్రం పైన మాత్రమే పేరు ఉండాలి.

బహుమతి పొందిన కథలు నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురితం అవుతాయి.

పది కథలను సాధారణ ప్రచురణ కోసం స్వీకరిస్తాం. ఈ కథలకు వెయ్యి రూపాయలతోపాటు, జ్ఞాపికలు అందజేస్తాం.

బహుమతి పొందిన కథలు పుస్తక రూపంలో కూడా అచ్చు వేసే అధికారం పోటీ
నిర్వాహకులకు ఉంటుంది.

విజేతలకు ముల్కనూరులో జరిగే సభలో బహుమతుల ప్రదాన
కార్యక్రమం ఉంటుంది.

కథలు మాకు అందాల్సిన చివరి తేదీ
జూలై 20, 2019

కథలపోటీ ఫలితాలు నమస్తే తెలంగాణ బతుకమ్మలో ప్రచురితం అవుతాయి.


కథలు పంపాల్సిన చిరునామా
బతుకమ్మ కథలపోటీ
నమస్తే తెలంగాణ
# 8-2-603/1/7, 8, 9, రోడ్ నంబర్ 10, బంజారాహిల్స్,
హైదరాబాద్ 500 034

మీ కథలు పంపాల్సిన ఈ -మెయిల్ ఐడీ
[email protected]

2433
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles