నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షో ప్రారంభం

Sat,August 18, 2018 12:22 PM

Namasthe Telangana Property Show inaugurates by Eetala Rajender

హైదరాబాద్ : విశ్వనగరంగా రూపాంతరం చెందడానికి భాగ్యనగరం వడివడిగా అడుగులు ముందుకేస్తున్నది. ఈ క్రమంలో హైదరాబాద్‌లో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలని కలలు కనేవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతున్నది. మరి, వీరి ఆలోచనలకు తగ్గట్టుగా పలు గృహసముదాయాల ప్రాజెక్టుల సమాచారాన్ని అందించడానికి.. నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోను ప్రారంభించింది.

నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోను రాష్ర్ట ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, ఉన్నత విద్యాశాఖ చైర్మన్ పాపిరెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్ కలిసి ప్రారంభించారు. ఈ ప్రాపర్టీ షో నేడూ, రేపూ శిల్పాకళావేదికలో కొనసాగనుంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నమస్తే తెలంగాణ సీఎండీ దామోదర్ రావు, వైస్ ప్రెసిడెంట్ రామారావు, ఎడిటర్ కట్టా శేఖర్ రెడ్డి, సీజీఎం సీహెచ్ శ్రీనివాస్ తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ఈ రెండు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల దాకా కొనసాగనుంది. ప్రతి గంటకు సర్ ప్రైజ్ గిఫ్టు ఉంటుంది.

నమస్తే తెలంగాణ ప్రాపర్టీ షోలో.. నగరంలోని వివిధ ప్రాంతాల్లో నిర్మితమవుతున్న ముప్పయ్ గేటెడ్ కమ్యూనిటీ అపార్టుమెంట్లు, ఐదు విల్లా ప్రాజెక్టులు, ఎనిమిది వెంచర్ల సమాచారం లభిస్తుంది. సుమారు 424 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణ పనులు జరుపుకుంటున్న వివిధ నిర్మాణాలకు సంబంధించిన వివరాల్ని ఈ ప్రాపర్టీ షోలో తెలుసుకోవచ్చు. ఈ ప్రాపర్టీ షోలో లభించే ఆరంభ ఫ్లాట్ ధర.. దాదాపు రూ.16.75 లక్షలు.

1898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles