ఫోటోగ్రఫీ పోటీల్లో 'నమస్తే'కు అవార్డులు

Sat,August 17, 2019 05:57 PM

Namasthe telangana photographers won best photography awards

హైదరాబాద్: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం నేడు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్.. నగరంలోని రవీంద్రభారతీలో రాష్ట్రస్థాయి ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహించింది. తెలంగాణ ప్రభుత్వ-పర్యాటక, భాషా, సాంస్కృతికశాఖ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ పోటీల్లో నమస్తే తెలంగాణకు చెందిన పలువురు ఫోటో జర్నలిస్టులు విజేతలుగా నిలిచారు. కేటగిరి-1లో వనపర్తికి చెందిన గుంటి వినోద్- పల్లె అందాలు. కేటగిరి-2లో నల్లగొండకు చెందిన ఆర్. ఆకాష్ - సంక్షేమ పథకాలు. కేటగిరి-3లో వరంగల్‌అర్బన్‌కు చెందిన గొట్టె వెంకన్న - చారిత్రక కట్టడాలు, హైదరాబాద్‌కు చెందిన జి. శ్రీనివాస్ - కళలు. బెస్ట్ న్యూస్ పిక్చర్స్ విభాగంలో కన్సోలేషన్ బహుమతి మహబూబ్‌నగర్‌కు చెందిన బందిగె గోపి విజేతలుగా నిలిచారు. విజేతలకు బహుమతి ప్రదానం ఆగస్టు 19 ఉదయం 10 గంటలకు రవీంద్రభారతీలో అందజేయడం జరుగుతుందని తెలంగాణ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు జి. భాస్కర్ తెలిపారు.


631
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles