టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకే లాభం: కేటీఆర్

Wed,March 20, 2019 07:23 PM

nakrekal constituency leaders join in trs party in the presence of ktr

హైదరాబాద్: కాంగ్రెస్ ఎంపీలు గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం... బీజేపీ ఎంపీలు గెలిస్తే నరేంద్ర మోదీకి లాభం.. టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణ సమాజానికి లాభం అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో నకిరేకల్‌కు చెందిన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్.. వాళ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మాట్లాడిన కేటీఆర్... తెలంగాణ భవన్‌ను చూస్తుంటే నిత్య కల్యాణం.. పచ్చ తోరణంలా ఉందన్నారు. తండోపతండాలుగా ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని.. కేసీఆర్ నాయకత్వానికి మద్దతు అంతకంతకూ పెరుగుతోందని వెల్లడించారు.

14 ఏళ్ల పాటు తెలంగాణ కోసం తెగించి కొట్లాడినం. చావు నోట్లో తల పెట్టి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్. దేశానికే ఆదర్శవంతమైన పథకాలు అమలవుతున్నాయి. అందరూ రైతుల గురించి మాట్లాడేవారే కానీ జైకిసాన్ అనే మాటను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు నినాదంగా వాడుకున్నాయి. జైకిసాన్ అనే మాటను టీఆర్‌ఎస్ మాత్రమే విధానంగా ఆచరించింది. వ్యవసాయం దండుగ అన్న చంద్రబాబు విధిలేక రైతుబంధు పథకాన్ని నకలు కొట్టారు. ఏపీ రైతులకు పంటసాయం అందుతుందంటే ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే. కేసీఆర్ మనసులో పుట్టిన ఆలోచన దేశం మొత్తం ఆలోచింపజేసింది.

మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలు దేశానికే స్ఫూర్తిదాయకంగా నిలిచాయి. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన మొనగాడు సీఎం కేసీఆర్. 16 మంది ఎంపీలుంటే ఇంకెన్ని సాధిస్తారో అర్థం చేసుకోవచ్చు. మన 16 ఎంపీలు రేపు 116 అవుతారు. నరేంద్రమోదీ ఐదేళ్లు కత్తికి ఎదురు లేకుండా ఏకఛత్రాధిపత్యంగా పాలించారు. ప్రతీ ఒక్కరి ఖాతాలో 15 లక్షలు వేస్తానని చెప్పి మరిచిపోయారు. ఎవరు రైల్వే మంత్రి అయితే వాళ్ల సొంతూరికి రైతు పోతుంది. లాలూప్రసాద్ యాదవ్ తన అత్తగారి ఊరికి కూడా రైలు వేసుకున్నారు. మోదీది గుజరాత్ కాబట్టి బుల్లెట్ రైలు ఆయన ప్రాంతానికి వెళ్లింది.

మన ప్రాజెక్టులకు జాతీయ హోదా రావాల్సి ఉంది. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే ఉలుకూ లేదు పలుకూ లేదు. గులాబీ సైనికులు ఢిల్లీలో ఉంటే మన ప్రాజెక్టులకు జాతీయ హోదా ఉరుక్కుంటూ రాదా. నకిరేకల్‌లో డ్రైపోర్టు సాధించుకోవచ్చు. వీరోచితంగా పోరాటం చేస్తే గానీ తెలంగాణకు ఎయిమ్స్ రాలేదు.

కాంగ్రెస్ గెలిస్తే ఏమైతది.. రాహుల్ సిట్ అంటే సిట్.. స్టాండ్ అంటే స్టాండ్.. రాహుల్ ఉస్కో అంటే ఉస్కో.. డిస్కో అంటే డిస్కో. ఢిల్లీని శాసించాలి తప్ప యాచించొద్దని జయశంకర్ సార్ అనేవారు. అసెంబ్లీ ఎన్నికల్లో దీవించినట్టే లోక్‌సభ ఎన్నికల్లో కూడా దీవించండి. రేపు 16 మంది అభ్యర్థులను సీఎం కేసీఆర్ ప్రకటించబోతున్నారు. 16కు 16 సీట్లు గెలవాల్సిన అవసరముంది.. అని కేటీఆర్ తెలిపారు.


1307
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles