సీఎం కేసీఆర్ మేధాశక్తి దేశానికి ఎంతో అవసరం

Sun,March 24, 2019 08:48 PM

nagarkurnool trs mp candidate election campaign in nagarkurnool

-నాగర్‌కర్నూల్ పార్లమెంటు అభ్యర్థి రాములు
నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి కేసీఆర్ మేధాశక్తి దేశానికి ఎంతో అవసరమని.. అందుకు 16 ఎంపీ స్థానాలు గెలువాల్సిన అవసరం ఉందని నాగర్‌కర్నూల్ టీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి పి.రాములు అన్నారు. వంగూరు మండలంలోని కోనేటిపూర్ వీహెచ్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఈ సందర్భంగా రాములు మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ గెలుపునకు కార్యకర్తలు ఐకమత్యంతో పని చేయాలని, 16 ఎంపీ స్థానాలు గెలిపించి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలన్నారు. ఈ సమావేశానికి అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజ్, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ్‌రెడ్డి, ఢిల్లీలో టీఆర్‌ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మందా జగన్నాధం, మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి పాల్గొన్నారు.

1467
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles