ప్రభుత్వ ఉపాధ్యాయుడు పరశురాంకు గోల్డ్ మెడల్

Thu,July 18, 2019 06:02 PM

Nagarkurnool Govt teacher parashuram bags gold medal from OU


నాగర్‌కర్నూల్ జిల్లా : ఉప్పునుంతల మండలం పెనిమిల్లలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పని చేస్తున్న పరశురాం గోల్డ్ మెడల్ అందుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో సామాజిక శాస్త్రంలో చేసిన పరిశోధనలకుగాను పరశురాంకు ఓయూ వీసీ ప్రొఫెసర్ రామచంద్రం గోల్ద్ మెడల్ ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి.రమేష్, ఉపాధ్యాయులు, స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, విద్యార్ధులు పరశురాంకు అభినందలు తెలియజేశారు. అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమంలో పీజీఆర్ఆర్ సీడీఈ డైరెక్టర్ ప్రొఫెసర్ సి.గణేష్ పాల్గొన్నారు.

655
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles