సెంటిమెంట్‌ను మార్చేసిన ఆ నియోజకవర్గం

Tue,December 11, 2018 03:11 PM

nagarkurnool constituency change a sentiment in 2018 elections

హైదరాబాద్ : ఎన్నికలు వస్తే నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో కాలు మోపాలంటే ప్రధాన పార్టీల నేతలు భయపడుతుండేవారు. ఎన్నికల ప్రచారానికైనా.. అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనటానికైనా నాగర్‌కర్నూల్‌కు వస్తే చాలు.. అధికారానికి దూరమవుతామనే భయం నేతలను వెంటాడేది. కానీ ఈ సారి ఆ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. నాగర్‌కర్నూల్ నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి మర్రి జనార్ధన్‌రెడ్డి తరపున సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయితే నాగర్‌కర్నూల్‌లో కాలు మోపితే అధికారానికి దూరమవుతామనే భయంతో గత 30 ఏండ్ల నుంచి అక్కడ ఒక్క ముఖ్యమంత్రి కూడా అడుగుపెట్టలేదు. 1989లో నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఓ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచారానికి రాజీవ్ గాంధీ హాజరయ్యారు. ఆ తర్వాత తన పదవిని రాజీవ్ కోల్పోయారు. నటుడు కృష్ణ కూడా ఎన్నికల ప్రచారానికి వచ్చి ఏలూరు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఎన్టీఆర్ కూడా ఇక్కడ ప్రచారంలో పాల్గొని ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో పరాజయం పాలయ్యారు. చంద్రబాబు, రాజశేఖర్‌రెడ్డి కూడా నాగర్‌కర్నూల్‌కు రాకపోవడానికి ప్రధాన కారణం అధికారానికి దూరమవుతామనే సెంటిమెంట్‌తోనే. మొత్తానికి సీఎం కేసీఆర్ నాగర్‌కర్నూల్‌లో పాదం మోపి.. టీఆర్‌ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడంతో.. ఆ సెంటిమెంట్ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.

4770
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles