ఢిల్లీలో నాగర్ కర్నూలు బాలుడు గుర్తింపు..

Mon,July 17, 2017 09:48 PM


న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీలో నాగర్ కర్నూల్ కు చెందిన బాలున్ని తెలంగాణ భవన్ అధికారులు గుర్తించారు. బాలుడిని నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం రోడ్ కి చెందిన సుధాకర్ (12) గా అధికారులు గుర్తించారు. సుధాకర్ ప్రస్తుతం ఢిల్లీ లోని మయూరి విహార్ లోని చైల్డ్ వెల్ఫేర్ కమిటీలో క్షేమంగా ఉన్నాడు. బాలుడిని వివరాలు అడిగి తెలుసుకోగా తన తల్లి పేరు వెంకటమ్మ, తండ్రి పేరు ఎల్లయ్య అని అధికారులకు చెప్పాడు. రాకేష్, శివ శంకర్ అనే వ్యక్తులు తనను ఢిల్లీ తీసుకువచ్చారని సుధాకర్ చెబుతున్నాడు. ఈ నేపథ్యంలో అధికారులు బాలుడు సుధాకర్ సమాచారాన్ని నాగర్ కర్నూల్ ఎస్పీ, పోలీస్ అధికారులకు అందించారు. పోలీసుల సహకారంతో అధికారులు బాలుడికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుని, వారి తల్లిదండ్రులకు అప్పగించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

374
Tags

More News