ప్రజా తీర్పును గౌరవిస్తున్నా : నాగం

Tue,December 11, 2018 10:38 AM

nagam Janardhan reddy lost from nagarkurnool

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్‌లో కాంగ్రెస్ అభ్యర్థి నాగం జనార్ధన్ రెడ్డి చతికిలపడ్డారు. పాలమూరు ఎత్తిపోతలకు అడ్డుపడ్డ నాగం జనార్ధన్ రెడ్డికి నియోజకవర్గ ప్రజలు చుక్కలు చూపించారు. తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి మర్రి జనార్ధన్ రెడ్డికి వస్తున్న మెజార్టీని చూసి.. ఓటమి తప్పదని భావించిన నాగం జనార్ధన్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు. ఈ సందర్భంగా నాగం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నానని స్పష్టం చేశారు. నాలుగో రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి 5,385 ఓట్లు పోలవ్వగా, కాంగ్రెస్‌కు 2,830 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా నాలుగు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్‌ఎస్‌కు 23 వేల పైచిలుకు ఓట్లు వచ్చాయి.

2916
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles