పార్టీని వీడుతున్నట్లు వార్తలు..స్పందించిన నాదెండ్ల

Sun,June 9, 2019 02:42 PM

Nadendla manohar reacts on resign to janasena party


జనసేన పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలను ఆ పార్టీ సీనియర్‌ నేత నాదెండ్ల మనోహర్‌ తోసిపుచ్చారు. ఈ విషయమై నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ..తాను పార్టీని వీడేది లేదన్నారు. తాను విదేశాల్లో ఉండటం వల్ల పార్టీ సమీక్షా సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. రావెల కిషోర్‌ బాబు వ్యక్తిగత కారణాలతో జనసేన పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో.. పార్టీ సమీక్ష సమావేశాలకు నాదెండ్ల హాజరు కాలేదు. దీంతో నాదెండ్ల కూడా పార్టీని వీడతారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. నాదెండ్ల మనోహర్ ఇటీవలే తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరఫున పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

3904
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles