కాళేశ్వరం ప్రాజెక్టుపై స్వర నీరాజనం..

Mon,October 21, 2019 08:02 AM

హైదరాబాద్ :తెలంగాణ రాష్ర్టాన్ని సశ్యశామలం చేసేందుకు ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం.. ఆ ప్రాజెక్టు విశిష్టతను వివరిస్తూ తె లంగాణ సినీ మ్యూజిషియన్స్ అసోసియేషన్ (టీసీఎంఏ) ఓ అద్భుతమైన నేపథ్య గీతాన్ని స్వరపరిచింది. 30 మంది సంగీత దర్శకులు, గాయకులు తమ గళాన్ని అందించారు. టీసీఎంఏ అధ్యక్షుడు, సంగీత దర్శకుడు బల్లేపల్లి మోహన్ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న పాటను సంగీత దర్శకుడు బోలే శావలి స్వరపర్చగా, మరో సంగీత దర్శకుడు వెంగి చక్కని సాహిత్యాన్ని అందించారు.


ఈ సందర్భంగా ఆదివారం బంజారాహిల్స్‌లోని అసోసియేషన్ కార్యాలయం లో ఏర్పాటు చేసిన పాట ఆవిష్కరణ కార్యక్రమానికి తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై టీసీఎంఏ కృషిని అభినందించారు. ఈ కార్యక్రమంలో తన్నీరు బాపురావు, టీసీఎంఏ కార్యదర్శులు బోళే శావలి, ఘంటాడి కృష్ణ, వెంగి, కేఎం రాధాకృష్ణ, ప్రమోద్, ఎంఎస్ బాబు, ముక్కెర రమేష్, ఏఆర్‌కే రాజు, పలువురు కళాకారులు పాల్గొన్నారు.

890
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles