లిఫ్ట్ ఇస్తే.. గొంతుకోశాడు..

Mon,February 18, 2019 08:23 AM

murder attempt at jeedimetla police station limits

జీడిమెట్ల : బైక్‌పై వెళుతున్న వ్యక్తిని ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడిగి బైక్‌పై కూర్చొని వెళుతున్న క్రమంలో కత్తితో గొంతుకోసి పరారైన సంఘటన జగద్గీరిగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ అక్రమ్‌బాబా కథనం ప్రకారం.. గాజులరామారం డివిజన్ చంద్రగిరినగర్‌కు చెందిన ఇమ్రాన్(28) వృత్తి వంట పని. రాత్రి శ్రీరామ్‌నగర్‌లోని ఓ ఫంక్షన్‌హాల్‌లో పనులు ముగించుకొని తెల్లవారు జామున ఇంటికి బైక్‌పై బయలుదేరాడు. మార్గ మధ్యలో ఓ గుర్తు తెలియని వ్యక్తి లిఫ్ట్ అడగగా బైక్‌పై ఎక్కించుకొని వెళుతున్న సమయంలో వెనుక కూర్చొని తన వెంట తెచ్చుకున్న కత్తితో ఇమ్రాన్ గొంతుకోసి పరారయ్యాడు. స్థానికులు అతడిని చికిత్స నిమిత్తం సూరారంలోని నారాయణ మల్లారెడ్డి దవాఖానకు తరలించారు. అనంతరం ఇమ్రాన్‌ను వేరే దవాఖానకు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇమ్రాన్‌కు ప్రాణాపాయం లేదని వైద్యులు ధ్రువీకరించారు. జగద్గిరిగుట్ట పోలీసులు ఇమ్రాన్ వాంగ్మూలం తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

2980
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles