మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన షెడ్యుల్ విడుదల

Tue,December 3, 2019 06:37 PM

హైదరాబాద్: మున్సిపాలిటీల్లో వార్డుల పునర్విభజన ప్రక్రియకు షెడ్యూల్ విడుదలైంది. మున్సిపల్ శాఖ దీనికి సంబంధించిన షెడ్యుల్‌ను విడుదల చేసింది. హైకోర్టు ఆదేశాలతో వార్డుల పునర్విభజన షెడ్యుల్‌ను విడుదల చేశారు. వార్డుల పునర్విభజన జాబితా ముసాయిదాను ఈ రోజు విడుదల చేస్తారు. రేపు పత్రికల్లో ముసాయిదాను ప్రచురిస్తారు. ఈనెల 9వ తేదీ వరకు ముసాయిదాపై అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. 9వ తేదీ సాయంత్రం 5గంటలకు అభిప్రాయాలు, సూచనలు స్వీకరిస్తారు. ఈ నెల 16వ తేదీ వరకు వినతులు, అభ్యంతరాల పరిష్కారానికి గడువు ఉంటుంది. ఈ నెల 17వ తేదీన పురపాలకశాఖ సంచాలకులకు వార్డుల పునర్విభజన జాబితా ఇస్తారు. డిసెంబర్ 17వ తేదీన పురపాలక వార్డుల పునర్విభజన తుది జాబితాను ప్రకటిస్తారు. 121 మున్సిపాలటీలకు, 10 కార్పోరేషన్‌లకు వార్డులను పునర్విభజిస్తారు.

914
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles