20న ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక

Sun,December 16, 2018 07:01 AM

MRPS new committee on this 20th

హైదరాబాద్: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్-టీఎస్) రాష్ట్ర కమిటీని రద్దుచేస్తున్నట్టు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మేడి పాపయ్య, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ తెలిపారు. నూతన కమిటీని ఈ నెల 20న ఎన్నుకోనున్నట్టు ప్రకటించారు. శనివారం ఉస్మానియా యూనివర్సిటీలోని టెక్నాలజీ కళాశాల ఆడిటోరియంలో ఎమ్మార్పీఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ముందుకెళ్లాలని నిర్ణయించినట్టు చెప్పారు. డప్పు, చెప్పు పెన్షన్ సాధనకోసం రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నట్టు పేర్కొన్నారు. జిల్లా కమిటీలన్నింటినీ పునర్నిర్మించి భవిష్యత్ ఉద్యమానికి సిద్ధంచేయాలని తీర్మానించినట్టు వివరించారు.

1255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles