ఎంపీ అభ్యర్థి గ్రామ ఎంపీటీసీ ఏకగ్రీవం..

Wed,April 24, 2019 09:59 PM

mptc to be elected unanimously in mahabubnagar trs candidate manne village

- ఫలించిన మన్నె శ్రీనివాస్‌రెడ్డి మంత్రాంగం
నవాబ్‌పేట: మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేట మండలం గురుకుంట ఎంపీటీసీ స్థానం దాదాపుగా ఏకగ్రీవమైంది. మహబూబ్‌నగర్ టీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్ధి మన్నె శ్రీనివాస్‌రెడ్డి సొంత గ్రామం గురుకుంటలో టీఆర్‌ఎస్ ఎంపీటీసీ అభ్యర్థిగా ఎర్రోళ్ల అనిత ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. ఈ స్థానం ఎస్సీ మహిళకు రిజర్వ్ కాగా ఎర్రోళ్ల అనిత పేరును మన్నె శ్రీనివాస్‌రెడ్డి ఖరారు చేసి నామినేషన్ వేయించారు. ఇతర పార్టీల నుంచి ఎవరూ నామినేషన్ వేయకపోవడంతో అనిత ఏకగ్రీవం కానున్నారు. గుర్తుల కేటాయింపు రోజు ఆమెను ఏకగ్రీవ ఎంపీటీసీగా ప్రకటించనున్నారు.

4594
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles