పెద్దమిడిసిలేరు ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌రావు హత్య

Fri,July 12, 2019 05:55 PM

MPTC Nalluri Srinivas Rao killed by Maoists in Bhadradri Kothagudem dist

భద్రాద్రి కొత్తగూడెం : చర్ల మండలం బెస్తకొత్తూరుకు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు, పెద్దమిడిసిలేరు ఎంపీటీసీ నల్లూరి శ్రీనివాస్‌రావు మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. ఎర్రంపాడు - పుట్టపాడు మార్గంలో శ్రీనివాస్‌రావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ నెల 8వ తేదీన రాత్రి 11 గంటల సమయంలో 15 మంది మావోయిస్టులు.. శ్రీనివాస్‌రావు కుటుంబంపై దాడి చేసి.. అనంతరం ఆయనను కిడ్నాప్ చేశారు. నాటి నుంచి శ్రీనివాస్ రావు ఆచూకీ తెలియలేదు. మొత్తానికి పోలీసులు ఇవాళ శ్రీనివాస్‌రావు మృతదేహాన్ని గుర్తించారు. ఘటనాస్థలిలో చర్ల ఏరియా కమిటీ కార్యదర్శి శారద పేరిట ఓ లేఖ వదిలి వెళ్లారు. ఇన్‌ఫార్మర్‌గా ఉన్నందుకే శ్రీనివాస్‌రావును హత్య చేసినట్లు లేఖలో వెల్లడించారు. ఆగస్టు 7వ తేదీతో శ్రీనివాస్‌రావు పదవీకాలం ముగియనుంది.

1228
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles