ముగిసిన తొలి విడుత పరిషత్ పోలింగ్

Mon,May 6, 2019 05:13 PM

MPTC and ZPTC election polling end in telangana

హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా తొలి విడుత ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు పోలింగ్ ప్రక్రియ ముగిసింది. ఇవాళ ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల దాకా కొనసాగింది. 5 గంటల వరకు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. తొలివిడుతలో భాగంగా 2,096 ఎంపీటీసీ, 195 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ నెల 10న రెండో విడుత, 14న మూడో విడుత ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 27వ తేదీన వెలువడనున్నాయి.

514
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles