రైల్వేమంత్రి గోయల్ తో ఎంపీ వినోద్ సమావేశం

Wed,August 22, 2018 04:52 PM

MP vinodkumar meets union minister piyush goyal

న్యూఢిల్లీ: టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ ఇవాళ ఢిల్లీలో రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయ‌ల్ ను కలిశారు. రాష్ట్రంలో రైల్వే శాఖకు సంబంధించి పెండింగ్ లో ఉన్న అంశాలు, కొత్త రైల్వే లైన్లు, రైల్వే స్టేష‌న్ల ఆధునీక‌ర‌ణ‌, ప‌లు స్టేష‌న్లలో రైళ్ల నిలుపుద‌లపై గోయల్ తో ఎంపీ వినోద్ చర్చించారు. గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధి, స‌మ‌స్యలపై కేంద్ర ప్రభుత్వం దక్షిణ మధ్య రైల్వే దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటికీ స్పందించ‌డం లేద‌ని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కు వివరించారు.

గ‌త బ‌డ్జెట్ లో కొత్త లైన్లు, రైల్వే స్టేష‌న్ల ఆధునీక‌ర‌ణ‌, మ‌ర‌మ్మత్తుల‌కు నిధులు కేటాయించినా ప‌నులు ఆశించినంత వేగంగా సాగ‌డం లేద‌ని తెలిపారు. ప‌నుల విష‌యంలో దృష్టి సారించాల‌ని, రాష్ట్రానికి ఇచ్చిన హామీల‌ను నెర‌వేర్చాల‌ని పియూష్ గోయ‌ల్ ని విజ్ఞప్తి చేశారు. హుజూ‌రాబాద్ మీదుగా క‌రీంన‌గ‌ర్-ఖాజీపేట కొత్త రైల్వే లైన్ వేయాల‌ని గోయల్ ను ఎంపీ వినోద్ కోరారు. ఈ ఏడాది డిసెంబ‌ర్ లో ప్రవేశపెట్టనున్న స‌ప్లిమెంట‌రీ బ‌డ్జెట్ లో ఈ రైల్వే లైన్ కు నిధులు కేటాయించాల‌ని కోరారు. ప్రస్తుతం ముంబై-నిజామాబాద్ వ‌ర‌కు న‌డుస్తున్న లోకమా‌న్య తిల‌క్ రైలును క‌రీంన‌గ‌ర్ వ‌ర‌కు పొడి‌గించాల‌ని కోరారు. మున్సిపాలిటీలు, మేజ‌ర్ ప‌ట్టణాలైన మెట్ ప‌ల్లి, కోరుట్ల‌, జ‌గిత్యాల‌, క‌రీంన‌గ‌ర్ నుంచి రోజు వేలాది మంది బస్సుల్లో ముంబై వెళ్తున్న విష‌యాన్ని కేంద్ర మంత్రి గోయల్ దృష్టికి తీసుకొచ్చారు.

క‌రీంన‌గ‌ర్ నుంచి తిరుప‌తికి రోజు వారి రైలును న‌డిపించాల‌ని ఎంపీ వినోద్ కోరారు. ప్రస్తుతం క‌రీంన‌గ‌ర్ నుంచి వారానికి రెండుసార్లు మాత్రమే రైలు న‌డ‌ప‌డం వ‌ల్ల అనేక మంది తిరుప‌తికి వెళ్లే భ‌క్తులు ఇబ్బందులు ప‌డుతున్నార‌ని, తిరుప‌తిలో ప్లాట్ ఫామ్ ఖాళీ లేద‌న్న సాకుతో రోజు వారి రైలు న‌డ‌ప‌క‌పోవ‌డం స‌రికాద‌ని కేంద్ర మంత్రికి సూచించారు. ధ‌న‌పూర్ ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-నాగపూర్ ఎక్స్ ప్రెస్ ల‌ను జ‌మ్మికుంట‌లో, సికింద్రాబాద్-కాగ‌జ్ న‌గ‌ర్ సూప‌ర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ ను ఉప్పల్ రైల్వే స్టేష‌న్లో నిల‌పాల‌ని ఎంపీ వినోద్ కేంద్ర మంత్రి గోయల్ ను కోరారు.

729
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles