రజత్‌కుమార్‌ను కలిసిన ఎంపీ వినోద్‌

Wed,October 31, 2018 04:12 PM

MP VINODKUMAR MEETS RAJATKUMAR TODAY

హైదరాబాద్: ఎంపీ వినోద్‌కుమార్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వినోద్ మీడియాతో మాట్లాడుతూ..రజత్‌కుమార్‌ను ఎన్నికల నియమాల గురించి కలిసినట్లు చెప్పారు. స్టార్ క్యాంపెయిన్ గురించి మేం ఇక్కడికి వచ్చినం. జాతీయ పార్టీలు, ప్రాంతీయపార్టీలకు సంబంధించిన 40 మంది ప్రచారంలో పాల్గొనవచ్చని చెప్పిన్రన్నారు.

టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ తెలంగాణలో విస్తృతంగా పర్యటన చేయనున్న నేపథ్యంలో హెలికాప్టర్ అనుమతికి సంబంధించిన విషయాలు అడిగినట్లు ఎంపీ వినోద్‌ చెప్పారు. ఖర్చులు పార్టీ కిందకు వస్తయి, సీఎం సెక్యూరిటీ యథావిధిగా ఉంటుంది. మంత్రుల నివాస గృహాల్లో పార్టీ సమావేశాలు పెట్టడం తప్పు అని మేము చెప్పినం. అయితే మంత్రుల ఇంటికి రాజకీయ నాయకులు రావడం మామూలే. అసెంబ్లీ రద్దు రోజే అధికార నివాసాలు వాడొద్దని సీఎం కేసీఆర్ స్పష్టంగా చెప్పిన్రని ఎంపీ వినోద్ అన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డిపై అనవసర ఆరోపణలు చేయడం మంచిదికాదన్నారు. ఖాసీంరజ్వీతో డీజీపీ మహేందర్‌రెడ్డిని పోల్చడం దుర్మార్గమన్నారు.

987
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles