కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు కరెక్టే: సుమన్

Thu,August 16, 2018 05:02 PM

mp suman speaks to media at trslp meeting

హైదరాబాద్: కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ చేసిన విమర్శలు కరెక్టేనని ఎంపీ బాల్క సుమన్ అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యక్రమంలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడిన సుమన్ కాంగ్రెస్‌ను ఏకిపారేశారు. "ప్రజలంతా కాంగ్రెస్‌ను తిడుతున్నారు. సొంత నియోజకవర్గం అమేథీలో మున్సిపాలిటీని కూడా రాహుల్ గెలిపించుకోలేకపోయారు. రాహుల్‌గాంధీకి ఏం సత్తా ఉంది. గాంధీ పేరు తప్ప రాహుల్‌కు ఉన్న గొప్ప ఏంటి? కాంగ్రెస్ పార్టీది అప్రజస్వామిక ధోరణి. ఉత్తమ్ కుమార్ కారులో కోట్ల రూపాయలు దొరకలేదా? రేవంత్ రెడ్డి అవినీతి ప్రజలకు తెలియదా? కాంగ్రెస్ అంటేనే అవినీతి. కాంగ్రెస్, టీడీపీ చీకటి పొత్తు చేసుకున్నాయి. రాహుల్ గాంధీని తీసుకొచ్చి రాష్ట్ర కాంగ్రెస్ నేతలు అబద్ధాలు చెప్పించారు. కాంగ్రెస్ నేతలకు కొంచమైనా సిగ్గుండాలి. ప్రాణహిత-చేవెళ్ల బోగస్ ప్రాజెక్టు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరును తీసేశామనడం అవాస్తవం.." అని సుమన్ మండిపడ్డారు.

2156
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS